హైదరాబాద్ : ఇతన్ని గుర్తు పట్టారు కదా? హైదరాబాద్ లో కొందరు ఇతన్ని ఇంటికి పిలిపించుకొని సన్మాన సత్కారాలు చేసి పునీతులు అయ్యారు.సోషల్ మీడియా లో ఫొటోలు పోస్టు చేసి సెలబ్రిటీ లుగా ఫీల్ అయ్యారు….!? కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలోని మహల్ రోజా మఠానికి చెందిన మల్లికార్జున ముత్యాపై షహపూర్ తాలూకా గోగి పోలీస్ స్టేషన్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు.మైనర్ బాలికతో అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణలతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు.ఒక బాలికతో అనుచితంగా ప్రవర్తిస్తూ తీసిన వీడియోలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.బాలిక గొంతు పట్టుకుని మంచం మీదకు తోసేయడం, ఆమె శరీరాన్ని తాకుతూ డ్యాన్స్ చేయడం, ముక్కు పిండడం వంటి దృశ్యాలు వైరల్ వీడియోల్లో కనిపిస్తున్నాయి.తాను దేవుడినని చెప్పుకునే మల్లికార్జున ముత్యాకు ఎంతో మంది భక్తులు ఉన్నారు.నిత్యం పరుగులు తీసే దేవుడిగా పేరు గాంచిన ఆయన ప్రస్తుతం పోలీసులకు దొరక్కుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
