- మరోసారి రికార్డు సృష్టించిన హౌసింగ్ బోర్డు వేలం-
- గరిష్ఠ ధర గజానికి 2.65 వేలు పలుకగా కనీస ధర రూ.1.30 వేలు
కూకట్ పల్లి : నేటి తెలంగాణ: కెపిహెచ్బీ కాలనిలో గజం భూమి రికార్డు ధర 2.65 లక్షలు పలికింది.1400 ఎస్ఎఫ్టి ఫ్లాట్ ఒక కోటి పది లక్షల రూపాయలు కొనుగోలు చేశారు. కే.పి.హెచ్.బి కాలని వేలంపాటలో 40 మంది బిడ్డర్లు పోటీ పడ్డారు.ఫేజ్–1, 2 ధర్మారెడ్డి కాలనీలో 4 ఓపెన్ ప్లాట్లు, వేలం వేశారు.దీనితోపాటుగా ఫేజ్–15 సంపూర్ణం అపార్ట్మెంట్లో 8 ఫ్లాట్లు హౌసింగ్ బోర్డు అధికారులు అమ్మారు.దీనిలో గరిష్ఠ ధర గజానికి 2.65 వేలు పలుకగా కనీస ధర రూ.1.30 లక్షలు పలికింది. కే.పి.హెచ్.బి కాలనీ భూముల అమ్మకంలో ప్రభుత్వానికి రూ.24.26 కోట్లు ఆదాయం లభించింది.
