- ఒకే స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఒకే సెంటర్ ఎలా
- న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు న్యూ ఎరా స్కూలే పరీక్ష కేంద్రం
- పరీక్షలకు పది రోజుల ముందే సంబంధిత పాఠశాలకు హాల్ టికెట్లు జారీచేస్తుంది విద్యాశాఖ
- హాల్ టికెట్లో సవరణలు ఉంటే సరి చేసిన తర్వాత మరోసారి ఫైనల్ హాల్ టికెట్లు పంపిస్తారు
- ఒకే సెంటర్లో 80 మంది విద్యార్థులకు ఒకే సెంటర్ పడితే ఎందుకు విద్యాశాఖ అధికారులు సవరించలేదు
పదవ తరగతి పరీక్షలలో విద్యాశాఖ విఫలమైంది. ఒకే స్కూల్ లో చదువుతున్న విద్యార్థులకు ఒకే సెంటర్ వేసిన విద్యాశాఖ అధికారులు ఏ విధంగా హాల్ టికెట్లు జారీ చేస్తారు. వివరాల్లోకెళ్తే కూకట్ పల్లి న్యూ ఏరా స్కూల్ చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే స్కూల్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు విద్యాశాఖ అధికారులు.. గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా ఉంచిన జిల్లా విద్యాధికారి మండల విద్యాధికారి కొన్ని తప్పులు జరుగుతాయి అంటూ తోసిపిచ్చే ప్రయత్నం చేశారు. పరీక్ష కేంద్రానికి వెళ్తున్న న్యూ ఎరా విద్యార్థులను ఎవరికి వెళ్తున్న హాల్ టికెట్ ఎవరీ చూపెట్టోదంటూ స్కూల్ యాజమాన్యం హుక్కుం జారీ చేసినట్లుగా సమాచారం. మార్కుల కోసం అధికారులతో ప్రవేట్ విద్యాసంస్థలు కుమ్మక్కయ్యార అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్ష హాల్ టికెట్ పది రోజుల క్రితమే జారీచేసిన విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలలో ఇంటి పేర్లలో కానీ పాఠశాల పేరు కానీ చదువుకునే విద్యార్థి పేరుగాని తప్పులు ఉంటే సవరించిన తర్వాత మరొకసారి ఫైనల్ హాల్ టికెట్లను ఆయా స్కూల్లోకి పంపుతారు విద్యాశాఖ అధికారులు ఒకరిద్దరూ విద్యార్థుల్లో సెంటర్లు తప్పు పట్టాయి అంటే అభ్యంతరం ఏముండదు కానీ ఏకంగా స్కూల్లో చదువుతున్న 60 శాతం విద్యార్థులు ఆ స్కూల్లోనే సెంటర్ పడడం పట్ల ప్రైవేటు స్కూల్ యజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మార్కులు ర్యాంకులు దండుకోవడం కోసం ప్రైవేటు స్కూల్లో ప్రభుత్వ అధికారులు లోపా కార్య ఒప్పందం వల్లనే న్యూఎరా స్కూల్లో 80 మంది విద్యార్థులకు అదే సెంటర్ నిర్వహించారని ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దీనిపైన విద్యాశాఖ జిల్లా అధికారి ఏలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే..

