కూకట్పల్లి: కూకట్పల్లి జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్ర వాహనాన్ని ఎంఎల్ఆర్ఐటీ (MLRIT) కళాశాల బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాదంలో బస్సు కింద పడిన లక్ష్మి (70) అనే మహిళ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు స్థానికంగా ఓ హోటల్లో పనిచేస్తున్నట్లు సమాచారం.ఈ ప్రమాదం కారణంగా కూకట్పల్లి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

