మియాపూర్ , జూలై 7(నేటి తెలంగాణ ): భర్త కనిపించడం లేదంటూ గతేడాది నవంబర్లో భార్య ఇచ్చిన ఫిర్యాదుపై మియాపూర్ పోలీసులు జరిపిన దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. భార్యే తన ప్రియుడితో కలిసి భర్తను అతి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.అనుమానంతో మహిళ కాల్ రికార్డ్స్, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. హత్య అనంతరం నిందితులు మృతదేహాన్ని మహారాష్ట్ర బోర్డర్ వరకు తరలించి, అక్కడ పూడ్చిపెట్టారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు స్థానిక పోలీసుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

