శైవక్షేత్రం శ్రీశైలం లోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు,కూడా స్వామివారి దర్శనానికి హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కి దేవస్థానం అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు.తరువాత గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు.దర్శనానంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని, కూకట్పల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
