కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ ఏసిపి కార్యాలయం సమీపంలో దుండగులు కళ్ళలో కారంకొట్టి కోటి రూపాయలు కొట్టేసిన సంఘటన చోటుచేసుకుంది.బహదూర్ పూర నుండి జీడిమెట్లకు హవాలా డబ్బు తీసుకెళ్తున్న అజాముద్దీన్ , కుస్రుఫ్ అనే ఇద్దరు వ్యక్తులు హవాలా డబ్బు మార్పిడి కోసం వారికి ఇచ్చిన నోటును మార్పిడి చేసి వారి దగ్గర డబ్బును జీడిమెట్లలో చేర్చి విధంగా కోటి రూపాయల హవాలా డబ్బును ద్విచక్ర వాహనంపై కాటన్ బాక్సులో తీసుకొని వెళ్తుండగా కూకట్ పల్లి పోలీస్ ఎసిపి ఆఫీసు సమీపంలో అజాముద్దీన్ , కుస్రుఫ్ కళ్ళలో కారం కొట్టి డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు పారిపోయారు. డబ్బు తీసుకొని వెళుతుండగా గట్టిగా అరవడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హవాలా డబ్బు తీసుకు వెళుతున్న వ్యక్తులని అదుపులోకి తీసుకొని విచారించగా సుమారు కోటి రూపాయలు తీసుకు వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు కలలో కారం కొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారని హవాలా డబ్బు బాధితులు అజాముద్దీన్ , కుస్రుఫ్ పోలీసులను ఆశ్రయించారు. కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి బాలనగర్ కూకట్ పల్లి పోలీసులు దుండగుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

