AP: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండేళ్ల తర్వాత సీబీఐ మళ్ళీ రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. పులివెందుల పోలీస్ స్టేషన్లో అధికారులు కీలక విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుల బంధువులైన మహేంద్ర యాదవ్, కిరణ్ కుమార్‌లకు నోటీసులిచ్చారు. హత్య జరిగిన రోజు అర్ధరాత్రి 1:42 గంటలకు జరిగిన వాట్సాప్ కాల్‌పై ఆరా తీస్తున్నారు. వేళకాని వేళ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.
