హైదరాబాద్ : నేటి తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా ప్రపంచ స్థాయి హాకీ పోటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మన్ కొండ విజయకుమార్ తెలిపారు. ప్రపంచంలోనే ఎనిమిది దేశాలతో కూడిన హాకీ టోర్నమెంట్ ను హైదరాబాదులోనే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈనెల 8వ తారీకు నుంచి హాకీ పోటీలు ప్రారంభమవుతాయని అన్నారు. ముఖ్యంగా క్రీడలకు పెద్దపీటవేసే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా హాకీ క్రీడా పోటీలకు కావలసిన అన్ని వసతులను ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఒలంపిక్ హాకీ క్రీడలకు వేదికగా హైదరాబాద్ నగరం ఉండేలా ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మన్ కొండ విజయకుమార్ అన్నారు.
