- కుళ్ళిపోయిన కె.ఎఫ్.సి చికెన్ కలకలం
- జిహెచ్ఎంసి ఫుడ్ ఇన్స్పెక్టర్ వివరాలను అడిగితే స్పందన కరువు
- తెలిసి తెలియక చిన్న పిల్లలు తింటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్న బాధితుడు
కూకట్ పల్లి: కూకట్ పల్లి అశోక వన్ మాల్లోని KFCలో కుళ్లిపోయిన చికెన్ కలకలం రేపింది. ఆర్డర్ చేసిన ఫుడ్ తినగానే దుర్వాసన రావడంతో కస్టమర్ యజమాన్యాన్ని నిలదీశాడు . మేనేజర్ మాట్లాడి వాదించడంతో కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేశారు.. గొడవ చేస్తున్నవారికి రిఫండ్ ఇచ్చారని కస్టమర్లు ఆరోపించారు. కుళ్లిపోయిన ఆహారం అందించి, ప్రశ్నిస్తే తిరిగి ఇస్తామని చెప్పడం ఏమిటని బాధితులు ప్రశ్నించారు.. చిన్న పిల్లలు తెలియక తింటే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇలాంటి యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేశారు..
