- పేదవాడి ఆకలి తీర్చడం కన్నా గొప్ప దైవకార్యం మరొకటి లేదు.
- ఇదే సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ దాసరి
- మణికంఠ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతివారం అన్నదాన మహా యజ్ఞం
- ఎండ, వానలను సైతం లెక్కచేయకుండా వారాంతాల్లో పేదలకు కడుపునిండా అన్నదానం
- 37వ వారానికి చేరిన మహా అన్నదాన ప్రసాద కార్యక్రమం
కూకట్ పల్లి : నేటి తెలంగాణ : కేపీహెచ్బీ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో జేసీ బ్రదర్స్ వెనుక 37 వారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 750 మందికి పైగా అభాగ్యులకు రుచికరమైన భోజనాన్ని వడ్డించారు. తన తల్లిదండ్రులు దాసరి శ్రీనివాసరావు, మైనేని ప్రసన్నల ఆశయ సాధన, వారి జ్ఞాపకార్థం రాహుల్ ప్రదీప్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.విరాళాలు తీసుకోకుండానే..సాధారణంగా ఇలాంటి పెద్ద కార్యక్రమాలకు దాతల సాయం తీసుకుంటారు. కానీ, ఈ అన్నదాన కార్యక్రమంలో అత్యంత గమనించదగ్గ విషయం ఏమిటంటే… బయటి వ్యక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం స్వీకరించకపోవడం. కేవలం స్వార్జితంతోనే రాహుల్ ప్రదీప్ ఈ యజ్ఞాన్ని నడిపిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సమాజంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదన్నదే నా ప్రధాన ఉద్దేశం. నా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ సేవను భవిష్యత్తులోనూ ఇలాగే నిరంతరాయంగా కొనసాగిస్తాను” అని స్పష్టం చేశారు. కడుపునిండా భోజనం చేసిన పేదలు రాహుల్ ప్రదీప్ సేవలను కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.


