
కూకట్పల్లిలో “రాధా కృష్ణ ఉత్సవ్ 2.0” పేరుతో హోలీ ఈవెంట్ నిర్వహిస్తామని ప్రకటించి టికెట్లు విక్రయించిన నిర్వాహకుడిపై కేసు నమోదైంది. ఎన్. సాయి కుమార్ సీరియల్ కళాకారులను తీసుకువస్తామని, భోజన వసతి కల్పిస్తామని చెప్పి బుక్ మై షో ద్వారా టికెట్లు అమ్మినట్లు ఫిర్యాదు అందింది.అయితే ప్రకటించిన విధంగా కళాకారులు రాకపోవడంతో పాటు ఏర్పాట్లు చేయకపోవడంతో బాధితుల నుంచి రూ.7,446 వసూలు చేసినట్లు ఆరోపించారు. ఈ మేరకు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
