హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారం షాపు యజమానికి నకిలీ గోల్డ్ బిస్కెట్లు ఇచ్చి నాణ్యమైన కిలో బంగారు నగలతో పరారయ్యాడు అగాంతకుడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఓ ప్రముఖ వ్యక్తి పిఏ అంటూ బంజారాహిల్స్ నగల వ్యాపారితో పరిచయం పెంచుకొని గతంలో బంగారు బిస్కెట్ లు ఇచ్చి నగల మార్పిడికి ఒప్పందం మూడు సార్లు అసలైన బంగారం తీసుకువచ్చి నగల మార్పిడి చేసుకున్నాడు. బంగారం షాప్ యజమానికి నమ్మకం కుదిరాక చివరకు ఇత్తడివి పుత్తడిగా నమ్మించి నాణ్యమైన కిలో బంగారం తీసుకొని మోసం చేశాడని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు శ్రీనాథ్ రాటి పై గతంలో కూడా సిసిఎస్ లో కేసులు ఉన్నాయని తెలిపారు. బాధితుని వద్ద ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
