
బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వంత్ కుమార్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితులు, వారి కుటుంబాలకు కలిపి సుమారు 500 మందికి ఆహారాన్ని అందించారు. ఈ సందర్భంగా అశ్వంత్ కుమార్ మాట్లాడుతూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సాయి అనిల్, సాయి కుమార్, రాజు, లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

