
శ్రావణమాస బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వివేక్నగర్లో శివాజీ దిల్దార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలారం బండి ఊరేగింపు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.నిర్వాహకుల ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు కార్యక్రమానికి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని భక్తులందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.అనంతరం నిర్వాహకులు వడ్డేపల్లి రాజేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవాన్ని భావితరాలకు అందించడంలో ఇటువంటి పండుగలు, ఉత్సవాలు ఎంతో కీలకమని అన్నారు. పలారం బండి ఊరేగింపును సంప్రదాయబద్ధంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. అమ్మవారి ఆశీస్సులతో కూకట్పల్లి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
