
కూకట్పల్లి,బాలికలను హెచ్పీవీ వైరస్ నుంచి రక్షించేందుకు కూకట్పల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ)లో ఈ నెలాఖరు వరకు ఉచితంగా హెచ్పీవీ టీకాలు అందిస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్ తెలిపారు.14 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 15 సంవత్సరాలు నిండని బాలికలు ఈ టీకాకు అర్హులని ఆయన పేర్కొన్నారు. హెచ్పీవీ వైరస్ వల్ల భవిష్యత్తులో వచ్చే పలు ఆరోగ్య సమస్యలను నివారించడంలో టీకా కీలకంగా పనిచేస్తుందని తెలిపారు.ప్రైవేట్ ఆసుపత్రుల్లో హెచ్పీవీ టీకాకు రూ.2 వేలకు పైగా ఖర్చవుతుండగా, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో అర్హులైన బాలికలకు పూర్తిగా ఉచితంగా టీకా అందిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని అర్హులైన బాలికలు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.తల్లిదండ్రులు అర్హత ఉన్న బాలికలను కూకట్పల్లి యూపీహెచ్సీకి తీసుకువచ్చి ఉచితంగా హెచ్పీవీ టీకా వేయించాలని డా. సాయి కిరణ్ కోరారు. బాలికల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా అందుబాటులో ఉన్న ఈ ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
