
బ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం కూకట్పల్లిలోని శేషాద్రినగర్ కమిటీ హాల్లో వైకుంఠ సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆయన కుమారులు తూండ్ల పట్టాభిరామ శర్మ, తూండ్ల వెంకట రమణ శర్మ, తూండ్ల గురు ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
