బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినాయక్‌నగర్‌లోని ఓ పాడుబడిన ఇంట్లో గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో ఇద్దరు మైనర్లు గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారి వద్ద నుంచి 3 గ్రాముల గంజాయి, అగ్గిపెట్టె, సిగరెట్ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

