
భూ వివాదం సెటిల్‌మెంట్ విషయంలో బాధితుడి వద్ద లంచం డిమాండ్ చేసిన చందానగర్ పోలీసులపై ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా చందానగర్ పోలీస్ స్టేషన్ అడ్మిన్ ఎస్‌ఐ బాలరాజుతో పాటు కానిస్టేబుళ్లు రాఘవ, రాజ్‌కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.ల్యాండ్ సెటిల్‌మెంట్ విషయంలో బాధితుడి వద్ద పోలీసులు డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించి లంచం తీసుకుంటున్న సమయంలో ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను పట్టుకున్నారు.ప్రస్తుతం ముగ్గురిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, కేసు నమోదు తదితర అంశాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
