
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చందానగర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై బాలరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం.లంచం తీసుకున్న ఆరోపణలపై ఎస్సై బాలరాజును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చందానగర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై బాలరాజును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
