
రూ.75 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన పోలీసులు

చందానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ, కానిస్టేబుల్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. కేసు దర్యాప్తులో అధికారిక అనుకూలత చూపేందుకు లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఏసీబీ వివరాల ప్రకారం.. చందానగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న బండెల బాలరాజు, కానిస్టేబుల్ బి. రాఘవేంద్ర కుమార్ కలిసి క్రైమ్ నంబర్ 696/2026 కేసు దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఫిర్యాదుదారుడిని లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో శనివారం రూ.75,000 లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.ఎస్ఐ బాలరాజు కార్యాలయ టేబుల్ డ్రాయర్ నుంచి రూ.75,000 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందే ఎస్ఐ రూ.20,000 నగదును, కానిస్టేబుల్ రాఘవేంద్ర కుమార్ రూ.10,000ను యూపీఐ ద్వారా స్వీకరించినట్లు ఏసీబీ తెలిపింది. విధులను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించి అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు.నిందితులను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ వెల్లడించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచారు.లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి:ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
