
ప్రియురాలికి సరదాగా పంపిన ప్రాంక్ మెసేజ్ ముగ్గురు యువకులను పోలీసుల ముందుకు తీసుకొచ్చింది. తాను కిడ్నాప్ అయ్యానంటూ సుమంత్ పంపిన మెసేజ్‌తో యువతి 112కు సమాచారం ఇవ్వడంతో కేపీహెచ్‌బీ పోలీసులు ఇండిస్ వన్సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని ఫ్లాట్‌కు చేరుకున్నారు.ముగ్గురు యువకులను విచారిస్తుండగా ఫ్లాట్‌లోని సూట్‌కేస్‌లో రూ.30 లక్షల నగదు గుర్తించారు. నగదుకు సంబంధించి సరైన సమాధానం రాకపోవడంతో వారి ఫోన్లను పరిశీలించగా క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించిన వ్యవహారాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.సుమంత్, మనోజ్, గౌతమ్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదు మూలం, బెట్టింగ్ వ్యవహారంపై కేపీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
