
కేపీహెచ్‌బీ టెంపుల్ బస్‌స్టాప్ వద్ద తాడికొండ చందు నూతనంగా ఏర్పాటు చేసిన దక్షిన్ దాబా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ కూకట్‌పల్లి కోఆర్డినేటర్ రెడ్డి సతీష్ ఆరోరా ముఖ్య అతిథిగా హాజరై దాబాను ప్రారంభించారు.ఈ సందర్భంగా సతీష్ ఆరోరా మాట్లాడుతూ.. దాబాకు వచ్చే కస్టమర్లకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ మంచి ఆదరణ పొందేలా దాబాను నిర్వహించాలని ఆకాంక్షించారు. నాణ్యత, రుచికి ప్రాధాన్యత ఇస్తూ వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించాలని నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అనిల్ నిమ్కర్, రాజేష్ రాయ్, వలవల నాయుడు, తుమ్మల మోహన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
