
కూకట్‌పల్లి: కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 6వ ఫేజ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పంచవటి అపార్ట్‌మెంట్‌లో ఐదో అంతస్తు నుంచి దూకిన ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని సీతా పురుషోత్తం (30)గా పోలీసులు గుర్తించారు. ఆమె కొంతకాలంగా డిప్రెషన్‌కు సంబంధించిన మందులు వాడుతున్నట్లు సమాచారం. ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
