20 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న కెపిహెచ్బి పోలీసులు
కేపీహెచ్‌బీ కాలనీ 1వ ఫేజ్‌లో గంజాయి కలిగి, సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేపీహెచ్‌బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ ఫేజ్-1, రోడ్ నంబర్-3లోని ఎస్‌ఎల్‌వీఆర్ పీజీ హాస్టల్‌లో ఇద్దరు వ్యక్తులు గంజాయి కలిగి సేవిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగేటి మహేష్ (28), ఎర్ర సాయికిరణ్ (33)లను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి 20 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టరు.

