
హైదరాబాద్‌లో మూడో స్టోర్‌ను ప్రారంభించిన సంస్థ
ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల సంస్థ అల్ట్రావైలెట్ కూకట్‌పల్లిలో తన మూడో ‘స్పేస్ స్టేషన్’ షోరూమ్‌ను ప్రారంభించింది. హైదరాబాద్ తమకు దేశవ్యాప్తంగా రెండో అతిపెద్ద మార్కెట్‌గా నిలిచిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.ఎఫ్47, ఎఫ్77 మోడళ్లను నగర వాహనదారులు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఐడీసీ నిబంధనల ప్రకారం ఒక్కసారి ఛార్జ్‌తో సుమారు 323 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉందన్నారు. బైక్‌ల ప్రారంభ ధర రూ.2.49 లక్షలు కాగా, బ్యాటరీ ఫ్లెక్స్ ఆప్షన్‌తో రూ.1.49 లక్షల నుంచే అందుబాటులో ఉంటాయని తెలిపారు.ప్రోగ్రెసివ్ ఆటోమోటివ్ గ్రూప్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్ట్రావైలెట్‌కు ఆరో స్టోర్ అని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

