విద్యార్థిని ప్రతిభకు ఎమ్మెల్యే అభినందనలు
: శ్రీ చైతన్య స్కూల్ శాంతినగర్ బ్రాంచ్‌కు చెందిన విద్యార్థిని ఆళ్ల ఖ్యాతి ప్రియ INTSo ఒలింపియాడ్ పరీక్షలో ప్రతిభ కనబరచి గ్రాండ్ ప్రైజ్‌గా ల్యాప్‌టాప్, మొదటి బహుమతిగా ట్యాబ్‌ను గెలుచుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసి ఆయన చేతుల మీదుగా బహుమతులు స్వీకరించింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారిని ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏజీఎం శివరామకృష్ణ, ఆర్ఐ పద్మజ, కోఆర్డినేటర్లు మురళీకృష్ణ, పీవీ శివ, ప్రిన్సిపాల్ మృణాళిని, డీన్ రాజేశ్వరరావు, ఇంచార్జ్ హరితతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
