కూకట్పల్లి వై జంక్షన్‌లోని లేక్ షోర్ మాల్లో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. మాల్‌ను సందర్శించేందుకు వచ్చిన సందర్శకులపై ఒక్కసారిగా బోర్డులు పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఆదివారం కావడంతో మాల్లో సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని మాల్ సిబ్బంది సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
