కూకట్పల్లి 6వ ఫేస్‌లో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఖాళీగా ఉన్న స్థలంలో పేరుకుపోయిన చెత్తకు మంటలు అంటుకుని ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. మంటలు వ్యాపించడంతో పక్కనే ఉన్న టీ స్టాల్, స్ట్రాప్ దుకాణం పూర్తిగా దగ్ధమయ్యాయి.స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
