ఆజ్ తక్ జర్నలిస్ట్ దామోదర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన కేటీఆర్
-బిఆర్ఎస్ పార్టీ తరుపున ఐదు లక్షల రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ కుటుంబానికి అండగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలిచారు.డిసెంబర్ 5 తారీకున జీడిమెట్లలో విధినిర్వహణలో భాగంగా డ్యూటీ చేస్తుంటే గుండెపోటుతో చెందిన సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ మృతి చెందాడు.దామోదర్ కి గుండెపోటు వచ్చిన రోజు కూడా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేక్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.దురదృష్టవశాత్తు చికిత్సకు స్పందించక మరణించిన దామోదర్ కుటుంబాన్ని గతంలో కేటీఆర్ పరామర్శించారు. దామోదర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పిన కేటీఆర్ శుక్రవారం నాడు తన వ్యక్తిగత హోదాలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసారు.కేటీఆర్ తరుపున దామోదర్ ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ దామోదర్ కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న విలేకరులకు ప్రభుత్వాలు కూడా అండగా నిలవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.