బి-ఫార్మసీ 4వ సంవత్సరం విద్యార్థులను డిసెంబర్ 2023 ప్రొసీడింగ్స్ ప్రకారం ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో జేఎన్టీయూ పాలన భవనం ముందు విద్యార్థులు ధర్నా నిర్వహించారు. డిసెంబర్ 2025 సర్క్యులర్ ఆధారంగా వందలాది మంది విద్యార్థులను డిటైన్ చేయడం అన్యాయమని విద్యార్థి నాయకులు జవ్వాజి దిలీప్, రాహుల్ నాయక్ తెలిపారు. వెంటనే డిటైన్ చేసిన విద్యార్థులను ప్రమోట్ చేసి న్యాయం చేయాలని, లేని పక్షంలో సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
