
అక్రమ నిర్మాణం కూలి పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పతనం.. భయంతో పరుగులు తీసిన స్థానికులు
గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. నాళాను ఆనుకుని తక్కువ విస్తీర్ణంలో అక్రమంగా నిర్మిస్తున్న భవనం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కూలిపోయినట్లు సమాచారం. భవనం శిథిలాలు పక్కనే ఉన్న వైట్‌ఫీల్డ్ అపార్ట్‌మెంట్‌పై పడటంతో ఆ భవనం కూడా పాక్షికంగా దెబ్బతిన్నది.స్థానికుల సమాచారం ప్రకారం.. సుమారు 50–60 గజాల స్థలంలో ఆరు నుంచి ఏడు అంతస్తులుగా నిర్మిస్తున్న ఈ భవనం ఒక్కసారిగా కూలడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో సమీపంలోని హాస్టల్‌లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. భవనంలో నిర్మాణ కార్మికులు లేదా ఇతరులు ఉన్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. భవనం కూలిపోవడానికి గల కారణాలు, ప్రాణనష్టం లేదా గాయాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

