
KPHB 3వ ఫేజ్‌లోని రామ్యా గ్రౌండ్స్‌లో సందీప్ ధన్పాల్, అరవింద్ చెర్రీ ఆధ్వర్యంలో నిర్వహణ.. ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
మెగాస్టార్, పద్మవిభూషణ్ డా. చిరంజీవి 71వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గం KPHB 3వ ఫేజ్‌లోని రామ్యా గ్రౌండ్స్‌లో సందీప్ ధన్పాల్, అరవింద్ చెర్రీ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, యువత స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.చిరంజీవి సేవా స్ఫూర్తితో నిర్వహించిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. పలువురు అభిమానులు, యువత, స్థానికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మందాడి శ్రీనివాస్‌రావు, తూము శ్రావణ్‌కుమార్, కూకట్పల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ సతీష్ అరోరా, రాజేష్ రాయ్, పాతూరి గోపి, జున్ను సాయి శ్రీనివాస్, వాలా వాలా నాయుడు, రాంబాబు నాయుడు, ఉపేందర్‌రెడ్డి, జి.ఎల్.ఎన్. రెడ్డి, తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

