
హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో అలసత్వం వహించారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.సుమంత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం చేయడంతో పాటు, అతడిని పట్టుకునే విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు సీఐపై ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీస్ కమిషనర్ సీఐపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.సుమంత్ వ్యవహారంలో పోలీసుల పనితీరుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శాఖాపరమైన చర్యలు చేపట్టినట్లు సమాచారం.
