
కూకట్పల్లి,జెండాలు కట్టే విషయంలో వివాదం తలెత్తడంతో ఓ మహిళపై దాడి జరిగినట్లు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు అందింది. శక్తినగర్–హబీబ్‌నగర్‌కు చెందిన కందాడి సావిత్రి ఫిర్యాదు మేరకు.. ఆదివారం రాత్రి కాలనీలో జెండాలు కట్టడంపై ప్రశ్నించడంతో గౌస్ పాషా, యూనుస్ పాషా తదితరులు తనపై దాడి చేసి కిందపడేసి తన్నారని ఆరోపించారు.తన కుమారుడు మధుసూదన్‌రెడ్డిని కూడా కొట్టి చంపుతామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో తల్లీకొడుకులకు గాయాలయ్యాయని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సావిత్రి పోలీసులను కోరారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
