కొంపల్లి సర్కిల్ లో జోరుగా అక్రమకట్టడాలు,ఇల్లీగల్ షెడ్లు..
- దూలపల్లి,సుభాష్ నగర్ లో కొరవడిన టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ ..
- రాంరెడ్డి నగర్,సుభాష్ నగర్ లో “జెట్ స్పీడ్”లో వెలుస్తున్న అక్రమషెడ్లు..
- ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి..
సిటీబ్యూరో,హైదరాబాద్ నేటి తెలంగాణ..కొంపల్లి మున్సిపాలిటీ జిహెచ్ఎంసి లో విలీనమై నెలలు గడుస్తున్న ఇక్కడి అధికారుల తీరుమారడం లేదు.సర్కిల్ ఎర్పాటులో భాగంగా సుభాష్ నగర్,సురారం డివిజన్ లను కొంపల్లి జిహెచ్ఎంసి లో వీలీనం చేస్తూ సర్కిల్ ఎర్పాటుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన ఇప్పటికి ఆయా ప్రాంతాలపై కొంపల్లి జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యంతో పూర్తిగా పర్యవేక్షణే కరువైంది..ఇదే అదనుగా ఇక్కడి ప్రాంతంలో అక్రమనిర్మాణాదారులు విచ్చలవిడిగా అక్రమకట్టడాల స్పీడ్ ను పెంచారు..సుభాష్ నగర్ లో వెలిసే అక్రమకట్టడాలు,ఇల్లీగల్ షెడ్ ల మొదలు,రాంరెడ్డి నగర్ సైతం వెలిసే ఇల్లీగల్ భారీషెడ్లతో నిత్యం ప్రమాదకరమైన స్థితిలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న అదికారుల్లో చలనం లేకుండా పోయింది..ఇక్కడ వెలిసే అక్రమనిర్మాణాలపై స్థానికులు పిర్యాదులు చేసిన,పలువార్త పత్రికల్లో కథనాలు వెలువడ్డ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల్లో చలనం శూన్యంగా మారింది.ఈ అక్రమనిర్మాణాల పర్వం ఇలాగే కొనసాగితే డివిజన్ అభివృద్ధి పూర్తి అంధకారంగా మారబోతుందని సుభాష్ నగర్ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
దూలపల్లి,న్యూ స్టీల్ సిటీ,సుభాష్ నగర్ లలో వెలుస్తున్న ప్రమాదకరమైన అక్రమకట్టడాలు..
కొంపల్లి సర్కిల్ పరిదిలోని దులపల్లి,కొంపల్లి,న్యూ స్టీల్ సిటీ,సుభాష్ నగర్,వెంకటాద్రినగరి తదితరప్రాంతాల్లో అక్రమనిర్మాణాల జాతరే కొనసాగుతోంది.దూలపల్లి మొయిన్ రోడ్ పై ఓ బార్ నిర్మాణం కోసం ఏకంగా పాత భవనాన్ని బార్ నిర్వాహణకోసం కమర్షియల్ గా మార్చి,అక్రమషెటర్లు నిర్మిస్తూ ఆ భవనం వెనుక భారీఇల్లీగల్ షెడ్ నిర్మాణం కొనసాగిస్తున్న సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల్లో చలనం లేకుండా పోయింది.దీంతో పాటు దూలపల్లి న్యూ స్టీల్ సిటీలో వెలిసే అక్రమ భారీషెడ్ లతో ప్రభుత్వానికి అందాల్సిన లక్షల రుపాయల కజానకు తీవ్రగండి పడుతుంది..కొంపల్లి జిహెచ్ఎంసి లో విలీనం చేసిన సుభాష్ నగర్,రాంరెడ్డి నగర్ లలో ప్రమాదకరమైన ఇల్లీగల్ షెడ్లు జెట్ వేగంతో నిర్మితమవుతున్న టౌన్ ప్లానింగ్ అధికారుల్లో ఉలుకుపలుకు లేకుండా పోవడం పట్ల సర్కిల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.ఇప్పటికైనా సర్కిల్ వ్యాప్తంగా వెలిసే అక్రమకట్టడాలపై కఠిన చర్యలు తీసుకొని,అక్రమ భవంతులకు “జిహెచ్ఎంసి సీజ్” లు ఎర్పాటుచేసి ప్రభుత్వానికి అందాల్సిన కజానే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని లేనియెడల అక్రమకట్టడాల ఫోటోలతో కూడిన వ్రాతపూర్వక కంప్లైంట్ లను డివిజన్ ల వ్యాప్తంగా సర్కిల్ డీసీ,జోనల్ కమీషనర్ తో పాటు జిహెచ్ఎంసి కమీషనర్ లకు అందజేసి అక్రమాలపై ఉక్కుపాదం మోపేవిధంగా పాటుపడతామని ప్రజలు మండిపడుతున్నారు..

: భాగ్యలక్ష్మీ కాలనీ రోడ్ (లక్ష్మీ శైలజ)హస్పిటల్ పక్కన వెలిసిన అక్రమసెల్లార్ తో కూడిన ఇల్లీగల్ భవంతి..


: సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్ లో వెలిసిన ఈఅక్రమషెడ్ కు టౌన్ ప్లానింగ్ అధికారులే భరోసా..
