బాలానగర్ డివిజన్ పరిధిలోని ఫిరోజ్‌గూడకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాజ్‌కుమార్ తండ్రి మృతి చెందడం పట్ల బాలానగర్ మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫిరోజ్‌గూడలోని వారి నివాసానికి వెళ్లి రాజ్‌కుమార్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాడి యాదయ్య, ఎడ్ల సదానంద్, ఎడ్ల ప్రభాకర్, మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
