* తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన కల్తీ పాల ఘటనలో మరో ఇద్దరు బాధితులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఫిబ్రవరి 15న గణేష్ అనే వ్యక్తి పలువురికి కల్తీ పాలను విక్రయించాడు. దీంతో ఆ పాలను తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
