
హైదరాబాద్: టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి 249 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావేటి నాగార్జున ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.నవీన్ పేటెంకు అప్పగించిన నూతన బాధ్యతకు ఆయన పూర్తిగా అర్హులని నాగార్జున పేర్కొన్నారు. అంకితభావం, నిబద్ధత, నాయకత్వ లక్షణాలతో కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, పార్టీ గొంతుకను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తారని ఆకాంక్షించారు. నూతన బాధ్యతల్లో నవీన్ పేటెం విజయవంతంగా రాణించాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
