
కూకట్పల్లి,ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూత అందించేందుకు యూత్ ఫర్ సేవా, ఓ సాఫ్ట్వేర్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కూకట్పల్లి ఉన్నత పాఠశాలలో బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది విద్యార్థులకు బ్యాగులను అందజేశారు.కూకట్పల్లి మండల విద్యాధికారి రవీందర్ రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు, దాతలు మరింత సహకరించాలని కోరారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో యూత్ ఫర్ సేవా ప్రతినిధులు, సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

