
అల్లాపూర్ డివిజన్‌కు చెందిన బతాళ నాగరాజు (తండ్రి బి. సుబ్బయ్య)కు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం అందింది. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన చేతుల మీదుగా రూ.2,00,000 చెక్కును లబ్ధిదారుడికి అందజేశారు.వైద్య చికిత్స అవసరాల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన CMRF–LOC నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, తూము శ్రవణ్ కుమార్, మైనారిటీ నాయకుడు గౌస్ ఉద్దీన్ పాల్గొన్నారు.
